: ఒడిశా నుంచి తెలంగాణకు గంజాయి స్మగ్లింగ్... సహకరిస్తున్న సీఐపై కేసు నమోదు


ఒడిశా నుంచి తెలంగాణకు లారీలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని రత్నాపురం గ్రామంలో ఈ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఈ స్మగ్లింగ్ కు సహకరిస్తున్న మారేడుమిల్లి సీఐ అంకబాబు, కానిస్టేబుల్ సత్యనారాయణలపై కేసే నమోదు చేసినట్టు చింతూరు ఓఎస్డీ ఫకీరప్ప తెలిపారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 63.70 లక్షలు ఉంటుందని చెప్పారు.

  • Loading...

More Telugu News