: ఉగ్రవాదంపై పోరుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి: పాక్ కు అమెరికా సూచన


ఉగ్రవాదంపై పాకిస్థాన్ చేస్తున్న పోరుకు అమెరికా మద్దతుగా ఉంటుందని వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. పాక్ భద్రతా దళాలు చేస్తున్న పోరులో సైనికులతో పాటు కొందరు సామాన్య ప్రజలు కూడా చనిపోతున్నారని... వారి త్యాగాలను తాము గుర్తిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే, ఉగ్రవాద నిర్మూలనకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉందని తమ అధ్యక్షుడు ఒబామా చెప్పినట్టు వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. మరో దేశంపై ఉగ్రదాడులు జరిపే ఉగ్ర సంస్థలకు ఏ దేశామూ ఆశ్రయమివ్వరాదని... ఇలాంటి చర్యలను అమెరికా అంగీకరించదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, పాక్ ను ఉగ్రదేశంగా గుర్తించాలంటూ 'వుయ్ ది పీపుల్' వైబ్ సైట్ కు 6,65,769 మంది తమ దరఖాస్తును పంపారు.

  • Loading...

More Telugu News