: పెళ్లి చేసుకోండి... పిల్లల్ని కనండి: చంద్రబాబు
దేశంలో పిల్లల సంఖ్య తగ్గిపోయే పరిస్థితి వచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పెళ్లిళ్లు చేసుకోకపోతే పిల్లల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. అందుకే పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనాలని ఆయన పిలుపునిచ్చారు. తనది ఒకే కులమని... అది పేద కులమని చంద్రబాబు అన్నారు. కులాల పేరుతో కొంతమంది జనాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిటీ వేసిన సంగతిని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తొలి రోజుల్లో డ్వాక్రా సంఘాలను చూసి చాలా మంది నవ్వారని, ఇప్పుడు వారందరికీ బుద్ధి వచ్చేలా డ్వాక్రా మహిళలు ఎదిగారని చెప్పారు. డ్వాక్రా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని... తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించాలని, అప్పుడు కొత్త రుణాలు వస్తాయని చెప్పారు. జన్ ధన్ ఖాతాలు ఉన్నవారు రూపే కార్డులు తీసుకోవాలని... వాటి ద్వారా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఆన్ లైన్ లావాదేవీలే ఎక్కువగా జరగబోతున్నాయని చంద్రబాబు చెప్పారు.