: రణబీర్ కు వీరిద్దరిలో ఎవరూ బెస్ట్ గర్ల్ ఫ్రెండ్ కాదు: కరీనా కపూర్


తన సోదరుడు, బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ కు ముద్దుగుమ్మలు కత్రినా కైఫ్, దీపికా పదుకొనేల్లో ఎవరూ సూటబుల్ కాదంటూ నటి కరీనా కపూర్ తేల్చి పారేసింది. కత్రినా, దీపికలిద్దరూ రణబీర్ తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. రణబీర్ తో బ్రేకప్ కానంతవరకు కత్రినాతో కరీనా క్లోజ్ గానే ఉండేది. ఈ తర్వాత వీరిద్దరి పెళ్లికి రణబీర్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో, కరీనా కూడా కత్రినాకు దూరమయింది. మరోవైపు, రణబీర్ తో బ్రేకప్ అయిన తర్వాత రణవీర్ సింగ్ తో దీపికా పదుకునే ప్రేమాయణం స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అసలు విషయానికి వస్తే... బాలీవుడ్ నటి నేహా ధూపియా నిర్వహిస్తున్న 'నో ఫిల్టర్ నేహ' కార్యక్రమంలో కరీనా పాల్గొంది. ఈ సందర్భంగా కరీనాను నేహ ఓ ప్రశ్న అడిగింది. రణబీర్ గర్ల్ ఫ్రెండ్స్ అయిన కత్రినా, దీపకల్లో ఎవరంటే ఇష్టమని, ఎవరి కాంబినేషన్ బాగుంటుందని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా, వీరిద్దరిలో ఎవరు కూడా తన సోదరుడికి మంచి గర్ల్ ఫ్రెండ్ కాదని కరీనా తేల్చి పారేసింది.

  • Loading...

More Telugu News