: బ్యాట్ సింగర్ కిచ్చి గిటార్ చేతబట్టిన సచిన్!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గిటార్ పట్టి రాక్ స్టార్ అవతారమెత్తాడు. ముంబైలోని శ్రీగాడ్జే మహారాజ పాఠశాలకు బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లేకు చెందిన ప్రముఖ గాయకుడు క్రిస్ మార్టిన్ తో కలిసి సచిన్ వెళ్లాడు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు ప్రముఖులు విద్యార్థులలో సహజంగా నెలకొన్న భయాలను పారద్రోలే ప్రయత్నం చేశారు. మంచి భవిష్యత్ కోసం ఎలా కష్టపడాలో వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పిన వీరిద్దరూ తమ ఆయుధాలతో అలరించారు. ఎప్పుడూ బ్యాట్ తో అలరించే సచిన్ గిటార్ వాయించి విద్యార్థులను ఎంటర్ టైన్ చేశాడు. ఈ సందర్భంగా క్రిస్ మార్టిన్ సచిన్ కు గిటార్ వాయించడంలో కొన్ని మెళకువలు నేర్పాడు. అనంతరం క్రిస్ మార్టిన్ చేతిలో సచిన్ బ్యాటు పెట్టాడు. దీంతో పిల్లల కోసం వీరిద్దరూ కాసేపు క్రికెట్ ఆడి అలరించారు. కాగా, క్రిస్ మార్టిన్ గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2016 కోసం ముంబై వచ్చిన సంగతి తెలిసిందే.