: బ్లాక్ మనీ మార్చుకోవాలనుకున్న ఇంజనీరింగ్ కాలేజీ వ్యూహం బెడిసికొట్టింది
అక్రమంగా కూడబెట్టిన డబ్బులు మార్చుకోవాలన్న ఇంజనీరింగ్ కళాశాల వ్యూహం బెడిసికొట్టిన ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే... చెన్నైకి చెందిన సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజమాన్యం లెక్కల్లో లేని 8 కోట్ల రూపాయలను తమ సిబ్బంది ఖాతాల్లో జమ చేసింది. తాజాగా ఆయా సిబ్బందిని కొత్త నోట్లు తీసుకురావాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఐటీ అధికారులు ఆ 8 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. కాగా, 2.5 లక్షల రూపాయల పరిమితితో పాత నోట్లను తమ అకౌంట్ల ద్వారా మార్చుకుంటే ఎటువంటి వివరాలూ ఇవ్వక్కర్లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిని ఉపయోగించుకుని సదరు కాలేజి ఈ పని చేసింది.