: ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న బాలీవుడ్‌ జంట


బాలీవుడ్‌ జంట అర్బాజ్‌ ఖాన్ (సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు- 49), మలైకా (43) విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. గ‌త కొంత కాలంగా వీరిద్ద‌రి మ‌ధ్య విభేదాలు తలెత్తాయని ఎన్నో వార్త‌లు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వారు ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్న‌ట్లు సమాచారం. ఇదిలా ఉంచితే, ఈ జంట ఈ ఏడాది మార్చిలోనే విడాకులు తీసుకోవాల‌ని అనుకున్నారు. అయితే, వారికి పెద్ద‌లు న‌చ్చ‌జెప్ప‌డంతో న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌లేదు. ఇప్పుడు మ‌ళ్లీ విభేదాలు ఎక్కువవడంతో ఇక కలసి జీవించడం అసాధ్యమని విడాకులకు వెళ్లినట్టు చెబుతున్నారు. 1998లో పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఓ కొడుకు ఉన్నాడు.

  • Loading...

More Telugu News