: సెల్ఫీ మరణాల్లో ప్రథమ స్థానంలో భారత్‌.. తర్వాతి స్థానంలో పాకిస్థాన్‌


ఇప్పుడు భార‌త్‌లో సెల్ఫీలకు ఉన్న క్రేజీ ఎలాంటిదో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. స్మార్ట్‌ఫోన్ చేత‌ప‌ట్టుకొని పిచ్చిపట్టిన‌ట్లు సెల్ఫీలు దిగుతున్నారు. ఎత్తైన ప్ర‌దేశాల్లో, క్రూర‌మృగాల‌తో, వెన‌క నుంచి రైలు వ‌స్తుండ‌గా వాటి ప‌ట్టాల‌పై నిలబడి... ఇలా ఎంతో ప్ర‌మాద‌క‌ర ప్ర‌దేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ యువ‌త త‌మ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సెల్ఫీల ట్రెండ్ పై అమెరికాకు చెందిన కార్నెగీ మెలాన్‌ యూనివర్శిటీ, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ తాజాగా ఓ అధ్య‌య‌నం చేసి ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించాయి. ప్ర‌పంచం మొత్తంలో 2014 మార్చి నుంచి ఇప్పటివరకు సెల్ఫీ లు తీసుకుంటూ మొత్తం 127 మంది ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొన్నాయి. అయితే, ఇందులో భార‌త్ కు చెందిన సెల్ఫీ మ‌ర‌ణాలే అత్య‌ధికం. భార‌త్‌లో సెల్ఫీ తీసుకుంటూ ఏకంగా 76 మంది మరణించారనే విష‌యం ప‌రిస్థితి తీవ్రతకు అద్దంప‌డుతోంది. మ‌న దేశం త‌రువాత పాకిస్థాన్లో తొమ్మిదిమంది, అమెరికాలో ఎనిమిదిమంది, రష్యాలో ఆరుగురు సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, భారత్‌ జనాభా ఎక్కువ క‌నుకే ఇక్క‌డ సెల్ఫీ మరణాలు అత్య‌ధికంగా న‌మోద‌వుతున్నాయ‌ని ప‌రిశోధ‌కులు భావిస్తున్నారు. అయితే, మ‌న క‌న్నా ఎక్కువ జనాభా గల చైనాలో ఈ కార‌ణంగా నలుగురే ప్రాణాలు కోల్పోవడం గ‌మ‌నార్హం. ఇటీవ‌లే ఉత్తర భారత్‌లో రన్నింగ్‌ ట్రైన్‌ ముందు నిల‌బ‌డి త‌మ స్టార్ట్‌ఫోన్‌లో స్టైలుగా సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు తీసుకోవ‌డ‌మే మ‌ర‌ణాలకు కార‌ణ‌మ‌ని ప‌రిశోధ‌కులు అంటున్నారు.

  • Loading...

More Telugu News