: 'ఇదే నా పెళ్లి కార్డు... 2.5 లక్షలివ్వండి' అంటే బ్యాంకు అధికారులేమన్నారో తెలుసా?


పెళ్లి కార్డుతో బ్యాంకులకు వెళ్లి 2.5 లక్షల రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాదులోని ఓల్డ్ బోయిన్ పల్లిలో అలేఖ్య, రవికిరణ్ అనే అన్నా చెల్లెళ్లు తమ సోదరికి వివాహం కుదరడంతో పెళ్లి కార్డు పట్టుకుని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కు వెళ్లారు. తమ సోదరి వివాహమని చెప్పిన ఆ ఇద్దరూ, తమ అకౌంట్లో ఉన్న 2.5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. దానిని చూసిన అధికారులు, కేంద్ర మంత్రి ప్రకటన సంగతి తమకు కూడా తెలుసని, అయితే ఈ మేరకు తమకు లిఖితపూర్వక ఆదేశాలు అందలేదని చెబుతూ వారిద్దరినీ రిక్తహస్తాలతో తిప్పి పంపారు. దీంతో పెళ్లి డేట్ దగ్గరపడుతుండడంతో టెన్షన్ పెరిగిపోతోందని వారు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News