: డ‌బ్రోవోనిక్‌లో ‘ఖైదీ నెం.150’... చిరంజీవి, కాజ‌ల్‌కు థ్యాంక్స్ చెప్పిన నగర మేయ‌ర్‌


ఎన్నో ఏళ్ల త‌రువాత మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ హీరోగా న‌టిస్తోన్న ఖైదీ నెం.150 సినిమా షూటింగ్ శ‌రవేగంగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా యూనిట్‌ క్రొయేషియా డ‌బ్రోవోనిక్‌ నగరంలో ఉంది. అక్క‌డి అందమైన లొకేష‌న్‌ల‌లో షూటింగ్ కొన‌సాగుతోంది. ఈ నేపథ్యంలో, డ‌బ్రోవోనిక్ మేయ‌ర్ అండ్రో వ్లాహుసిక్‌ మెగాస్టార్ చిరంజీవి, ఆ సినిమా హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్‌ల‌ను ప్ర‌త్యేకంగా క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఖైదీ నెం.150 షూటింగ్ కోసం త‌మ ప్రాంతానికి వ‌చ్చి, ప‌ర్యాట‌క ప‌రంగా త‌మ ప్రాంత అభివృద్ధికి తోడ్ప‌డుతున్నార‌ని మేయర్ కొనియాడారు. ఈ సంద‌ర్భంగా చిరంజీవికి ఆయ‌న ఓ జ్ఞాపిక‌ను కూడా ప్రదానం చేశారు. త‌మ ప్రాంతంలో ఏ ర‌క‌మైన ఇబ్బందులూ రాకుండా అండ్రో వ్లాహుసిక్ ఈ సినిమా యూనిట్‌కి ప్ర‌త్యేకంగా ఆతిథ్యం ఇస్తున్నారు.

  • Loading...

More Telugu News