: పుజారా అవుట్... టీమిండియా 62/3
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా పేలవ ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం ఉంచాలన్న లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు ఆదిలోనే బ్రాడ్ షాకిచ్చాడు. ఆదిలోనే ఓపెనర్లు మురళీ విజయ్ (3), కేఎల్ రాహుల్ (10) లను పెవిలియన్ పంపి సత్తాచాటాడు. దీంతో కేవలం 17 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఛటేశ్వర్ పుజారా (1) ను ఆండర్సన్ బౌల్డ్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ (29) కి జతగా అజింక్యా రహానే (8) క్రీజులోకి వచ్చాడు. దీంతో టీమిండియా రెండో టెస్టు రోండో ఇన్నింగ్స్ లో పేలవ ఆటతీరుతో 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లతో రాణించగా, ఆండర్సన్ ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నాడు.