: బంపర్ ఆఫర్...యాపిల్ ఐఫోన్ 7పై 28 వేల డిస్కౌంట్.. షరతులు వర్తిస్తాయ్!
యాపిల్ ఐఫోన్ 7 అభిమానులకు బంపర్ ఆఫర్ లభిస్తోంది. డిసెంబర్ 31లోపు యాపిల్ ఐఫోన్ 7 మోడల్ కొనుగోలుదారులకు 28 వేల రూపాయల డిస్కౌంట్ ఆఫర్ చేశారు. ఈ డిస్కౌంట్ లభించాలంటే మీరు సిటీ బ్యాంకు కార్డ్స్ వినియోగదారులై ఉండాలి. లేదా, ఐపాడ్, ఐఫోన్ 7 లేదా 7 ప్లస్ కాంబోలో కొనుగోలు చేయాల్సిందే. సిటీ బ్యాంక్ కార్పొరేట్ క్రెడిట్ కార్డ్స్ కలిగిన వారికి ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఫోన్ కొనుగోలు చేసినప్పుడు మొత్తం ధర చెల్లించాల్సిందే...అనంతరం ఈ 28 వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ను సిటీ బ్యాంక్ కార్డ్స్ ఉన్న వారు మాత్రమే పొందగలరు. ఈ మొత్తం మొబైల్ కొనుగోలు చేసిన 90 రోజుల్లోపు వినియోగదారుడి సిటీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కానుంది. ఈ ఆఫర్ 2016 డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో వుంటుంది.