: విశాఖ రెండో టెస్టు మ్యాచు: ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ భారత్ పర్యటనలో భాగంగా విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 455 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను ముగించిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్లో తమ ముందు టీమిండియా ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు విఫలమవుతున్నారు. నిన్న తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసిన ఇంగ్లండ్ ఈ రోజు మరో వికెట్ కోల్పోయింది. ఈ రోజు ఆటలో 12 పరుగుల వ్యక్తిగత స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన బెయిర్ స్టో, బెన్ సోక్స్ట్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం 53 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బెయిర్ స్టో ఔటయ్యాడు. మరోవైపు బెన్ సోక్స్ట్ 61 పరుగులతో క్రీజులో ఉన్నాడు. బెయిర్ స్టో వెనుదిరిగాక క్రీజులోకి వచ్చిన రషీద్ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లలో షమీ, ఉమేష్, యాదవ్ లకు ఒక్కోవికెట్ దక్కగా, అశ్విన్ రెండు వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు ఆరువికెట్ల నష్టానికి 210 పరుగులు(86 ఓవర్లికి)గా ఉంది.