: నానమ్మను గుర్తు చేసుకుంటూ, ఆమెకు తేనీరు తాగిస్తున్న ఫోటోను ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ... మీరూ చూడండి
దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంత్యుత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్న వేళ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ అరుదైన ఫోటోను పంచుకున్నారు. తన చిన్నతనంలో నానమ్మ ఇందిరా గాంధీకి స్వయంగా తేనీరు అందిస్తున్న ఓ చూడచక్కని చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘‘ఇందిరాజీని స్మరించుకుంటున్నా, ఓ పోరాట యోధురాలు, విప్లవకారిణి, దృఢ నిశ్చయమున్న మహిళ, కారుణ్యం, త్యాగశీలత కలగలిసిన మా నానమ్మ నా స్నేహితురాలు, నాకు అనునిత్యమూ మార్గనిర్దేశం చేసే వెలుగు’’ అని ట్వీట్ చేశారు. రాహుల్ ట్వీట్ చేసిన క్యూట్ ఫోటోను మీరూ చూడండి!
Remembering Indiraji:a warrior,a revolutionary,a woman of conviction,compassion & sacrifice.My grandmother,my friend,my ever guiding light pic.twitter.com/IcpKGNsdd7
— Office of RG (@OfficeOfRG) November 19, 2016