: బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య కేసు: ఏడుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు
కర్నూలు జిల్లా నంద్యాల ఆర్‌జీఎం కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉషారాణి అనే విద్యార్థిని హాస్టల్ గదిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ విద్యార్థిని కడప జిల్లా బద్వేల్ కు చెందిన అమ్మాయి. తమ కూతురిని సీనియర్లు వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఏడుగురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు చేశారు. నిందితులని కఠినంగా శిక్షించాలని ఉషారాణి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీలో సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని ఉషారాణి తోటి విద్యార్థినులు ఆరోపణలు చేశారు.