: చెన్నైలో ట్రంప్ దోశ... తెల్లగా ఉండటమే స్పెషాలిటీ!


చెన్నైలో ఇప్పుడు స్పెషల్ అల్పాహారం... డొనాల్డ్ ట్రంప్ దోశ. నగరంలోని ముకుందు అనే హోటల్ యజమాని ట్రంప్ ను విపరీతంగా అభిమానిస్తాడు. ఆయన విజయం సాధించాక, సంబరాలు చేసుకోవడంతో పాటు వెరైటీగా ఏదైనా చేయాలని భావించాడు. తన కుమారులతో చర్చించి తెల్లగా కనిపించే దోశను వేయాలని, దానికి 'ట్రంప్ దోశ' అని పేరు పెట్టాలని భావించి 10 నుంచి 15 సార్లు ప్రాక్టీస్ చేశాడు. రుచిగా వచ్చేలా వేడివేడి దోశలు వేసి నలుగురికీ వడ్డించి శభాష్ అనిపించుకున్నాడు. ఇప్పుడు చెన్నైలో ఈ ట్రంప్ దోశ టిఫిన్స్ లో హాట్ ఫేవరెట్ గా మారింది.

  • Loading...

More Telugu News