: వైసీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, పద్మావతిల గృహ నిర్బంధం ... అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత
తుంగభద్ర ఆయకట్టు భూములకు నీటిని తక్షణం వదలాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. వైకాపా నేతలు పెద్దఎత్తున తరలిరావడం, వారికి మద్దతుగా వేలాది మంది కార్యకర్తలు, రైతులు పట్టణంలోకి ప్రవేశించడంతో పోలీసులు పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వైకాపా నేతలు ర్యాలీ జరపకుండా, ఎలాంటి నిరసనలు తెలియజేయకుండా చూసేందుకు పలువురిని గృహ నిర్బంధం చేశారు. పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, పద్మావతిని హౌస్ అరెస్ట్ చేశారు. వైకాపాకు మద్దతు తెలిపిన సీపీఎం, సీపీఐ నేతలను సైతం ఇల్లు కదలనివ్వలేదు. పోలీసుల వైఖరిని తీవ్రంగా విమర్శించిన అనంత వెంకట్రామిరెడ్డి, నీరు అడిగిన పాపానికి ఇలా ఇళ్ల నుంచి బయటకు కదలనీయకపోవడం దుర్మార్గమని అన్నారు.