: తాగుబోతుల వీరంగం.. జామకాయలు తిన్నారు.. డబ్బులడిగితే చితక్కొట్టారు!
అనంతపురంలోలోని తాడిపత్రిలో నడిరోడ్డుపై తాగుబోతులు వీరంగం చేశారు. రోడ్డుపై జామకాయలు అమ్ముకుంటున్న చిరువ్యాపారి వద్దకు గుంపుగా వచ్చిన ఆరుగులు మందుబాబులు జామకాయలు తిన్నారు. అయితే, జామకాయలకు డబ్బులివ్వమని అడిగినందుకు వాటిని అమ్ముతున్న వ్యక్తిని చితక్కొట్టారు. మమ్మల్నే డబ్బు అడుగుతావా? అంటూ బీభత్సం సృష్టించారు. డబ్బులివ్వబోమంటూ చిరువ్యాపారిపై అంతాకలిసి దాడికి దిగారు. జామకాయల బండిని రోడ్డుపై పడేశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి ఓ కెమెరా కంటికి చిక్కాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకున్నారు.