: ఇంగ్లండ్ టీములో లక్కీయెస్ట్ ప్లేయర్ స్టోక్స్... ఇందుకే మరి!


ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ క్రికెట్ పోరులో అత్యంత అదృష్టవంతుడైన ఆటగాడు ఇంగ్లండ్ జట్టులోని స్టోక్స్ అని క్రీడా పండితుల నుంచి అభిమానుల వరకూ కితాబిస్తున్నారు. భారత ఆటగాళ్లు సులువైన క్యాచ్ లను మిస్ చేయడంతో తొలి టెస్టులో స్టోక్స్ రెండు సార్లు జీవనదానాన్ని పొంది, ఆపై సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ఆయనకు వేసిన బంతి, వికెట్లను తాకినప్పటికీ, బెయిల్స్ కింద పడకపోవడంతో బతుకు జీవుడా అని తప్పించుకున్నాడు. ఆపై తన ఇన్నింగ్స్ ను నేడు కొనసాగిస్తుండగా, కీపర్ సాహా, అందివచ్చిన ఓ స్టంపింగ్ అవకాశాన్ని వదులుకున్నాడు. ఆపై మరో లైఫ్ లభించింది. బంతి కాలికి తగలగా, ఎల్బీడబ్ల్యూ అపీల్ చేసిన వేళ, అంపైర్ నాటౌట్ గా ఇచ్చాడు. ఆ బంతి రీప్లేలో స్పష్టంగా వికెట్లను తాకేలానే కనిపించింది. దీంతో స్టోక్స్ మరోసారి అవుట్ కావడాన్ని తప్పించుకుని, భారీ స్కోరు దిశగా సాగుతున్నాడు. అదృష్టమంటే ఇంతేకదా?!

  • Loading...

More Telugu News