: మెలానియా కోసం దుస్తులు డిజైన్ చేసేది లేదంటున్న ఫేమస్ ఫ్రాన్స్ ఫ్యాషన్ డిజైనర్


ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫ్యాషన్ ప్రపంచం ఎవరికి మద్దతిచ్చిందో అందరికీ తెలిసిందే. అధునాతన ఫ్యాషన్ ను అమితంగా ఫాలో అయ్యే తొలి మహిళ మిచెల్ ఒబామా నుంచి అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ వరకూ ఎన్నో దుస్తులను తయారు చేసి ఇచ్చిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సోఫీ థెల్లెట్, తాను కాబోయే ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కు దుస్తులు డిజైన్ చేయబోయేది లేదని స్పష్టం చేశారు. ఆమె భర్త రాజకీయ దృక్పథం, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణమని, ఇతర డిజైనర్లు కూడా తనను అనుసరించే అవకాశాలున్నాయని అన్నారు. తాను తొలి మహిళకు దుస్తుల విషయంలో ఎటువంటి సహాయమూ అందించబోనని ఆమె బహిరంగ లేఖ రాశారు. ఆమె భర్తకు, కాబోయే అధ్యక్షుడిగా విలువలు లేవని ఆరోపించారు. 2009 నుంచి సోఫీ మిచెల్ ఒబామా కోసం పని చేస్తున్నారు.

  • Loading...

More Telugu News