: ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం ... నగదు రూపంలో అడ్వాన్స్ ఇస్తామంటున్న ఏపీ, తమకూ కావాలంటున్న తెలంగాణ ఉద్యోగులు
నోట్ల రద్దు ఎఫెక్ట్ ప్రభుత్వ ఉద్యోగులపై పడింది. బ్యాంకు ఖాతాల్లో డబ్బు ఉన్నప్పటికీ, దాన్ని డ్రా చేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఏపీ ఉద్యోగులకు రూ. 10 వేల వరకూ అడ్వాన్స్ రూపంలో అందే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ అడ్వాన్స్ ను నవంబర్ నెల నుంచి మినహాయించుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నిన్న జారీ కాగా, తెలంగాణ ఎన్జీఓలు సైతం ప్రభుత్వాన్ని అడ్వాన్స్ కోసం కోరుతున్నారు. దీనిపై కేసీఆర్ సర్కారు సానుకూలంగా స్పందించవచ్చని తెలుస్తోంది. కాగా, నవంబర్ నెల వేతనం మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించాలని కోరుతున్న ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే సీఎస్ ను కలిసి వినతిపత్రాన్ని కూడా సమర్పించారు.