: బంగాళాఖాతంలో అల్పపీడనం... తిరిగి రానున్న భారీ వర్షాలు
మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహా సముద్రంలో బంగాళాఖాతాన్ని ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనుందని వివరించారు. ఆపై ఇది బంగాళాఖాతం వైపు పయనిస్తుందని, దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులకు అవకాశాలు ఉన్నాయని మత్స్యకారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.