: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి.. చేతిలో సెల్‌ఫోన్ కూడా లేకుంటే!.. ప్రస్తుతం ప్రజల పరిస్థితి ఇదే: చంద్రబాబు
పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని ప్రజలు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయినట్టు బాధపడుతున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధచూస్తుంటే జాలేస్తోందన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు కేంద్రం తక్షణం చొరవ తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్రం, ఆర్బీఐ గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు. లిఫ్ట్‌లో ఒంటరిగా ఇరుక్కుపోయి, చేతిలో సెల్‌ఫోన్ కూడా లేకుంటే ఎంతటి ఆందోళనకు గురవుతామో.. ఇప్పుడు ప్రజలు కూడా అటువంటి ఇబ్బందులే పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఒక్కశాతం మంది వద్దే నల్లధనం ఉందని, కానీ ఇప్పుడు పేదలు, సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను తీర్చేందుకు రిజర్వ్‌బ్యాంక్ తక్షణం రూ.10 వేల కోట్లు పంపాలని కోరారు.