: ఇండియా డిఫరెంట్...వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదు: సల్మాన్ ప్రియురాలు లులియా వంతూర్


బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రేయసి రొమేనియన్ మోడల్ లులియా వంతూర్‌ మధ్య బంధం తెగిపోయిందని, ఆమె స్వదేశం వెళ్లిపోయిందని బాలీవుడ్ లో పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రొమేనియాకు చెందిన ఓ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. తాను హిందీలో పాడటం నేర్చుకుంటున్నానని చెప్పింది. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నానని వెల్లడించింది. రొమెనియాతో పోల్చుకుంటే ఇండియాలో వాతావరణం చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పింది. భారత్ లో మనుషుల వ్యక్తిత్వాలు, సంప్రదాయాలు, ఆచారాలు.. ఇలా ప్రతి అంశం విభిన్నంగానే ఉంటుందని పేర్కొంది. భారత్ లో ఎవరికీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదని చెప్పింది. చాలా మంది ఒకే ఇంటిలో నివసిస్తారని తెలిపింది. దీంతో వ్యక్తిగత స్వేచ్ఛ అన్న అంశమే ఉండదని పేర్కొంది. దీంతో లులియాకు సల్మాన్ కు మధ్య ప్రేమబంధం తెగిపోలేదని, వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోయినా భారత్ లో ఆమె సల్మాన్ కోసమే ఉంటోందని బాలీవుడ్ అభిప్రాయపడుతోంది.

  • Loading...

More Telugu News