: ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కోచ్ గా జయవర్థనే


ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ హెడ్‌ కోచ్‌ గా శ్రీలంక మాజీ కెప్టెన్‌ మహేల జయవర్ధనేను నియమించినట్టు యాజమాన్యం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఇంతవరకు కోచ్ గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ స్థానంలో అతనిని నియమిస్తున్నట్టు తెలిపింది. ముంబై ఇండియన్స్ తరపున తన కెరీర్ చివర్లో ఆడిన పాంటింగ్, ఆ టీమ్ కి కోచ్ గా నాలుగు సీజన్లకు వ్యవహరించాడు. అతని స్థానంలో ఐపీఎల్‌ లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్, కింగ్స్‌ లెవన్‌ పంజాబ్, కోచి టస్కర్స్‌ కేరళ జట్లకు ప్రాతినిధ్యం వహించిన జయవర్థనేను కోచ్ గా ఎంపిక చేయడం ఆసక్తి రేపుతోంది. కాగా, జయవర్థనే శ్రీలంక క్రికెట్ దిగ్గజాలలో ఒకరు. 2007 వన్డే ప్రపంచ కప్‌ లో జయవర్ధనే సారథ్యంలో లంక ఫైనల్‌ కు చేరింది. 2014లో టీ20 వరల్డ్ కప్ గెల్చుకున్న శ్రీలంక జట్టులో తను కీలక సభ్యుడు కావడం విశేషం. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కోచ్‌ గా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. జట్టుతో కలిసి పనిచేస్తానని, జట్టును విజయపథంలో నడిపేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. కోచ్‌ గా కొత్త అధ్యాయం ప్రారంభిస్తానని జయవర్ధనే తెలిపాడు. త్వరలో జట్టు మేనేజ్ మెంట్ తో సమావేశం కానున్నట్టు తెలిపాడు.

  • Loading...

More Telugu News