: హైదరాబాద్ రైతుబజార్ లో నగదు, కార్డు రహిత సేవలు ప్రారంభం

హైదరాబాద్ లోని రైతు బజారులో తొలిసారిగా నగదు, కార్డు రహిత సేవలు ప్రారంభమయ్యాయి. కూకట్ పల్లి రైతు బజారులో ఈ సేవలను మంత్రి హరీష్ రావు ఈరోజు సాయంత్రం ప్రారంభించారు. నగదు, కార్డు రహిత సేవలు ఏ విధంగా అందిస్తారంటే... వినియోగదారుల ఆధార్ కార్డు నంబర్లు, వేలిముద్రలను తీసుకుని రైతు బజార్ కౌంటర్ లో టోకెన్లు జారీ చేస్తారు. ఈ టోకెన్లతో సరుకులు కొనుగోలు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు వివరాల ద్వారా వినియోగదారుడి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు వసూలు చేస్తారు.