: ఆ నటికి తెలియకుండానే సందీప్ కిషన్ జుట్టు దువ్వేశాడు!


యువనటుడు సందీప్ కిషన్ సరసన రెజీనా, ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్న చిత్రం ‘నక్షత్రం’. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ సరదాగా సాగుతోంది. ముఖ్యంగా సెట్స్ లో భలే తమాషా సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని కృష్ణవంశీ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసిన వీడియోనే చెబుతోంది. ఈ వీడియోలో ప్రగ్యా జైశ్వాల్ మేకప్ గర్ల్ ని పక్కకు జరగమని చెప్పి, ఆమె చేతిలోని దువ్వెన తీసుకున్న సందీప్ కిషన్, ప్రగ్యా తల దువ్వాడు. అయితే, ఎవరితోనో మాట్లాడుతున్న అందాల సుందరి ప్రగ్యా ఈ విషయాన్ని గమనించలేదు. చివరకు, తన జుట్టు దువ్వుతున్నది సందీప్ కిషన్ అని తెలుసుకున్న ప్రగ్యా ఆశ్చర్యపోయింది. కాగా, కృష్ణవంశీ పోస్ట్ చేసిన ఈ వీడియోకు ‘లైక్’లు తెగ కురుస్తున్నాయి.

  • Loading...

More Telugu News