: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల భాషాపరమైన తప్పులను సరిచేస్తున్న కాపీ ఎడిటర్ అరెస్టు
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేసే తప్పులను సరిచేసే కాపీ ఎడిటర్ ను జర్మన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల స్టేట్మెంట్లలోను, వారి భావజాలానికి సంబంధించిన సాహిత్యంలోను తలెత్తే తప్పులతో భావపరమైన సమస్య ఏర్పడకుండా వుండడం కోసం మిఖైల్ ఎస్ (18) అనే యువకుడు ఆ తప్పులను సరిద్దుతున్నాడు. ఉగ్రవాదులు ఆన్ లైన్ లో పెట్టిన పోస్టుల్లో తప్పులను ఎడిట్ చేసి, వారు చేసే దారుణాలను త్యాగాలుగా మలచే పనిని మిఖైల్ ఎస్ చేస్తుంటాడు. ఈ పని అతనికి ఎవరూ అప్పజెప్పకపోయినా, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన అతను ఆ పని చేస్తానంటూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను సంప్రదించాడని, అతనిపై నిఘా వేసి, నిర్ధారణ అయిన అనంతరం అతనిని బెర్లిన్ లో అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. కేవలం వారు చేసే తప్పులను సరిచేయడమే కాకుండా, ఆ వీడియోలను ఇంగ్లిష్, జర్మన్, టర్కిష్ భాషల్లోకి అనువాదం కూడా చేస్తున్నాడని వారు పేర్కొన్నారు.