: ముగిసిన రెండో రోజు ఆట...ఇంగ్లండ్ 103/5
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఒక్క రోజులోనే 11 వికెట్లు నేలకూలాయి. తొలి రెండు రోజులు టీమిండియా ఆధిపత్యం నడిచింది. 317 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా లంచ్ సమయానికల్లా ఆరు వికెట్లు కోల్పోయి 455 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు ఆదిలోనే వికెట్ తీసి షమి షాకిచ్చాడు. అనంతరం సమన్వయ లోపంతో హమీద్ చేసిన తప్పిదాన్ని అద్భుతంగా వినియోగించుకుని సాహా పెవిలియన్ కు పంపాడు. అనంతరం డక్కెట్, రూట్ లను అశ్విన్ అవుట్ చేశాడు. తరువాత జయంత్ యాదవ్ మ్యాజిక్ బంతికి మెయిన్ అలీ వెనుదిరిగాడు. దీంతో రెండో టెస్టు, రెండో రోజు, తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు 49 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసి, 352 పరుగులు వెనకబడింది. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండడంతో టీమిండియాది పైచేయిగా నిలిచింది. క్రీజులో బెయిర్ స్టో (12), బెన్ స్టోక్స్ (12) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో రెండు వికెట్లతో అశ్విన్, చెరొక వికెట్ తో షమి, జయంత్ యాదవ్ ఆకట్టుకున్నారు.