: పూర్తిగా తీరనున్న చిల్లర కష్టాలు.. ఏటీఎంల సామ‌ర్థ్యం రూ.4 లక్ష‌ల నుంచి రూ.60 ల‌క్ష‌ల‌కు పెంపు


న‌గ‌దు కొర‌త‌తో బాధ‌ప‌డుతున్న ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డానికి కేంద్ర ఆర్థిక శాఖ వేగంగా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇక‌పై ఏటీఎంల సామ‌ర్థ్యం రూ.4 లక్ష‌ల నుంచి రూ.60 ల‌క్ష‌ల‌కు పెంచాల‌ని నిర్ణ‌యించుకుంది. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా 1,20,000లకు పైగా ఏటీఎంలు ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రో ఐదు రోజుల్లో మ‌రో 70 వేల‌ ఏటీఎంలను కూడా పెంచ‌నుంది. రోజుకు సుమారు 10 వేల ఏటీఎంల చొప్పున‌ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజున 12,500 ఏటీఎంల పెంపున‌కు సిబ్బంది రంగంలోకి దిగారు. మ‌రో 15 రోజుల్లో 2 ల‌క్ష‌ల‌కు ఏటీఎంల సంఖ్య చేర‌నుంద‌ని ఆర్థిక శాఖ ప్ర‌క‌టించింది.

  • Loading...

More Telugu News