: సోషల్ మీడియాలో బ్యాంకు సిబ్బంది నిర్వాకం.. వీడియో హల్ చల్


పెద్దనోట్ల రద్దుతో బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు ప్రజలు బారులు తీరుతున్నారు. ఎన్ని గంటల సమయం పట్టినా సరే, బ్యాంకు సిబ్బంది ఇచ్చిన వందనోట్లను తీసుకుని వెళ్లేవారు కొందరైతే, నో క్యాష్ అనే బోర్డులు చూసి వెనుదిరిగే వారు మరికొందరు. అయితే, బ్యాంకు ‘క్యూ’లో లేదా ఏటీఏం ‘క్యూ’లో నిలబడకుండా, నగదు మార్పిడి పత్రాలు నింపకుండా, ఎంచక్కా, డబ్బుల కట్టను దొడ్డిదోవలో పట్టుకెళ్లే పరపతి గల వాళ్లూ లేకపోలేదు. ఇందుకు ఉదాహరణ, ఢిల్లీలోని ఒక బ్యాంకు సిబ్బంది చేసిన నిర్వాకమే. బ్యాంకు కిటికీ వద్ద వేచి ఉన్న ఒక బడాబాబుకు సదరు బ్యాంకు మేనేజర్ డబ్బు కట్టను అందజేశాడు. గుట్టుచప్పుడు కాకుండా జేబులో పెట్టుకుని వెళుతున్న సదరు వ్యక్తిని, అంతే గుట్టుచప్పుడు కాకుండా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాలకు చేరడంతో నెటిజన్లు పలు విమర్శలు చేస్తున్నారు. సామాన్య ప్రజలు గంటల తరబడీ ‘క్యూ’లో నిలబడాలా?, బడాబాబులకు, పరపతి గలవాళ్లకు బ్యాంకు సిబ్బంది దొడ్డిదోవన డబ్బు కట్టలు అందిస్తారా? అంటూ మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News