: బెయిల్స్ పడలేదు... బతికిపోయిన బెన్ స్టోక్స్!
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బౌల్డ్ అయినప్పటికీ అవుట్ కాకపోవడం విశేషం. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో ఐదు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లండ్ ను ఆదుకోవాలనే లక్ష్యంతో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ (3), బెయిర్ స్టో (5) పట్టుదల ప్రదర్శిస్తున్నారు. 41వ ఓవర్ బౌలింగ్ చేసేందుకు బంతి అందుకున్న జయంత్ యాదవ్ అద్భుతమైన బంతిని సంధించాడు. బంతి గింగిరాలు తిరుగుతూ ఆఫ్ స్టంప్ ను ముద్దాడుతూ వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. జయంత్ యాదవ్ ఉత్సాహం ప్రదర్శించి, అంతలోనే సైలెంట్ అయిపోయాడు. వికెట్లను తాకిన బంతి బెయిల్స్ ను కిందపడేయలేదు. దీంతో బెన్ స్టోక్స్ అవుట్ కాకుండా బతికిపోయాడు. దీంతో 87 పరుగులకు ఐదు టాపార్డర్ వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుండడంతో పేసర్లకు విశ్రాంతినిచ్చిన కోహ్లీ స్పిన్నర్లతో బంతిని వేయిస్తూ ఒత్తిడి పెంచుతున్నాడు.