: రాత్రంతా ఫిట్ నెస్ గురించి చర్చే... సల్మాన్, చరణ్ ఒకర్నొకరు పొగుడుకోవడంతోనే సరిపోయింది!: ఉపాసన
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా చెల్లెలు ఆనం మీర్జా వివాహం సందర్భంగా సంగీత్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో ప్రముఖ టాలీవుడ్ నటులు వెంకటేశ్, ప్రభాస్, రానా, రామ్ చరణ్ దంపతులు, శ్రియతో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్, పరిణీతీ చోప్రా, ఫరా ఖాన్, అర్జున్ కపూర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ భార్య సానియా చెల్లెలి సంగీత్ లో జరిగిన ఓ ఆసక్తికర అంశాన్ని అభిమానులతో పంచుకుంది. రాత్రంతా సల్లూభాయ్, చెర్రీ ఫిట్ నెస్ గురించి మాట్లాడుకున్నారని, ఈ విషయంలో ఒకర్నొకరు ప్రశంసించుకుంటూనే ఉన్నారని ఉపాసన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఫిట్ నెస్ గురించి ప్రశంసించుకోవడంలో రామ్ చరణ్ నుంచి సల్మాన్ టు సానియా మీర్జా, హుమా ఖురేషీ అని ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా సల్మాన్ తో దిగిన సెల్ఫీని కూడా ఆమె పోస్ట్ చేసింది.