: పెద్దనోట్ల రద్దుతో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి.. అల్లర్లు జరిగే అవకాశాలున్నాయి: సుప్రీంకోర్టు


పెద్ద నోట్ల రద్దు విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. నోట్ల రద్దుపై దాఖలైన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ ఈరోజు విచారణ నిర్వహించారు. నోట్ల రద్దు కారణంగా దేశంలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయని..అల్లర్లు చెలరేగే అవకాశాలున్నాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దేశంలోని పలు రాష్ట్రాల హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లపై విచారణను నిలిపివేయాలన్న కేంద్రం వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సమస్య తీవ్రంగా ఉన్నందువల్లే దేశ వ్యాప్తంగా ఉన్న పలు కోర్టులలో పిటిషన్లు దాఖలు అవుతున్నాయని సీజేఐ టీఎస్ ఠాకూర్, జస్టిస్ అనిల్ దవేలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఉపశమనం కోసమే కోర్టులను ఆశ్రయిస్తున్నారని పేర్కొంది. నగదు బదిలీ పరిమితిని రూ.4,500 నుంచి రూ.2000 ఎందుకు తగ్గించారని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సమాధానమిస్తూ, ఎక్కువ మంది ఖాతాదారులు తమ నోట్లను మార్చుకునే అవకాశం కల్పించేందుకే నగదు బదిలీ పరిమితిని తగ్గించామని చెప్పారు. ఈ నెల 8కి ముందు 80 శాతం రూ.500, రూ.1000 నోట్లే మార్కెట్ లో ఉన్నాయని, అందువల్లే, వందనోట్ల కొరత ఏర్పడిందని ధర్మాసనం ముందు ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News