: గుర్తుపట్టలేనట్లు తయారైన ఈ నటి మహేష్ బాబుకు దగ్గరి బంధువు!
గతంలో విడుదలైన ‘బ్రహ్మ’ చిత్రంలో కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు సరసన శిల్పా శిరోద్కర్ అనే బాలీవుడ్ భామ నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ఎంతో గ్లామరస్ గా, సుకుమారంగా కనపడే శిల్పాశిరోద్కర్ ప్రస్తుతం ఎవరూ గుర్తుపట్టలేనట్లుగా తయారైంది. కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె గత మూడేళ్లుగా టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు ఆమె హాజరైంది. ఆమె శిల్పా శిరోద్కర్ అని చెబితే తప్పా, ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఆమె మారిపోయింది. మాజీ మిస్ ఇండియా అయిన శిల్పా శిరోద్కర్ ప్రముఖ నటుడు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కు పెద్ద అక్కయ్య. కాగా, త్రినేత్ర, హమ్, ఖుదాగవా, ఆంఖే తదితర బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ శిల్పాశిరోద్కర్ నటించింది.