: తొలి వికెట్ తీసిన షమి... ఇంగ్లండ్ కెప్టెన్ అవుట్


విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆదిలోనే ఫలితం సాధించింది. 317 పరుగులతో రెండో రోజు తొలి సెషన్ ప్రారంభించిన టీమిండియా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 151 పరుగుల ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరుకు కేవలం 16 పరుగులు జోడించిన కోహ్లీ అవుటయ్యాడు. దీంతో టీమిండియా వికెట్ల పతనం ప్రారంభమైంది. దీంతో 455 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించగా, బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టుకు ఆదిలోనే మహ్మద్ షమీ షాక్ ఇచ్చాడు. కేవలం రెండు పరుగులు చేసిన ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ ను పెవిలియన్ కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ కీలకమైన వికెట్ కోల్పోయింది. అనంతరం మరో ఓపెనర్ రూట్ కు హమీద్ జత కలిశాడు. వీరిద్దరూ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు కేవలం 27 పరుగులు చేసింది. కోహ్లీ బౌలర్లను మార్చుతూ ఫలితం రాబట్టే పనిలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News