: వాట్సప్ వీడియో కాలింగ్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారా..? హెచ్చరికలు చేస్తోన్న నిపుణులు


ప్రతి స్మార్ట్ ఫోన్ వినియోదారుడు అమితంగా ఇష్టపడే వాట్సప్ తాజాగా విడుదల చేసిన వీడియో కాలింగ్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకునే ముందు కాస్త జాగ్ర‌త్త వ‌హించండి. ఇప్ప‌టివ‌ర‌కు బీటా వర్షన్‌ యూజర్లు మాత్ర‌మే ఈ అప్లికేష‌న్‌ను అప్‌డేట్ చేసుకున్నారు. తాజాగా ఈ ఫీచ‌ర్ అంద‌రు యూజ‌ర్లకు అందుబాటులో ఉంది. అయితే, గ‌తంలో వాట్స‌ప్ గోల్డ్ అంటూ వినియోగ‌దారుల‌ను బోల్తా కొట్టించి, దాన్ని ఇన్‌స్టాల్ చేసుకున్న వారి వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను హ్యాక‌ర్లు లాగేసిన‌ట్లే, ఇప్పుడు కూడా హ్యాకర్లు వాట్స‌ప్ వీడియో కాలింగ్ నకిలీ అప్లికేష‌న్ల‌పై దృష్టి సారించారు. వాట్స‌ప్ లో ఈ ఫీచర్ ని డౌన్‌లోడ్ చేసుకోండంటూ హ్యాక‌ర్లు ప‌లు లింకులు పంపుతున్నారు. ఈ మోసపూరిత లింక్స్ గురించి తెలియ‌ని యూజ‌ర్లు వాటిని అత్య‌ధికంగా షేర్ చేస్తున్నారు. అయితే, ఈ లింకుల‌పై క్లిక్ చేస్తే వినియోగ‌దారులు త‌మ‌ వాట్సప్ అకౌంట్‌ హ్యాకర్ల చేతుల్లోకి వెళుతోంది. ఇటువంటి లింకుల‌ను న‌మ్మ‌కూడ‌ద‌ని, కేవలం గూగుల్ ప్లే స్టోర్ ద్వారా మాత్రమే అప్లికేషన్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రోవైపు, వాట్సప్ లోకి అందుబాటులోకి వచ్చిన వీడియో కాలింగ్ స‌దుపాయంపై ప‌లువురు యూజర్లు వాట్సప్ దాని నాణ్యత పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీడియో క్వాలిటీ బాగోలేక‌పోవ‌డంతో పాటు అది ఎక్కువ డేటాను లాగేస్తోంద‌ని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News