: చివర్లో మెరుపులు... 455 పరుగులకు భారత్ ఆలౌట్


విశాఖపట్నంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్ 455 పరుగుల వద్ద ముగిసింది. తొలి రోజు ఆటను 4 వికెట్ల నష్టానికి 317 పరుగుల వద్ద ముగించి, రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్, లంచ్ తరువాత గంట సేపటికి ఆలౌట్ అయింది. కోహ్లీ ఔట్ తరువాత స్వల్ప విరామాల్లో మూడు వికెట్లను కోల్పోయిన జట్టును అశ్విన్ తన అద్భుత హాఫ్ సెంచరీతో మరోసారి ఆదుకున్నాడు. చివర్లో టెయిలెండర్లు ఉమేష్, షమీ మెరుపులతో 129.4 ఓవర్లలో భారత జట్టు 455 పరుగులకు ఆలౌటైంది. జట్టులో మురళీ విజయ్ 20, కేఎల్ రాహుల్ 0, పుజారా 119, కోహ్లీ 167, రహానే 23, అశ్విన్ 58, సాహా 3, జడేజా 0, జయంత్ యాదవ్ 35, ఉమేష్ యాదవ్ 13, షమీ 7 పరుగులు చేశారు. 167 పరుగులు చేసిన కోహ్లీ సైతం తన ఇన్నింగ్స్ లో సిక్స్ కొట్టలేక పోగా, చివరాఖరి బ్యాట్స్ మెన్ షమీ తానాడిన తొలి బంతినే సిక్స్ గా కొట్టడం గమనార్హం. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్ సన్, అలీలకు 3 వికెట్ల చొప్పున దక్కగా, రషీద్ 2 వికెట్లు, బ్రాడ్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. మరికాసేపట్లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది.

  • Loading...

More Telugu News