: మరింత పతనమైన బంగారం, క్రూడాయిల్ ధరలు
ఇండియాలో పాత కరెన్సీ రద్దు, బంగారం కొనుగోలు చేసేందుకు నగదు కొరత వెరసి కొనుగోళ్లపై ప్రభావం చూపడంతో బంగారం ధరలు నేడు మరింతగా పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఉదయం 12:50 గంటల సమయంలో 10 గ్రాముల బంగారం ధర (డిసెంబర్ 5 డెలివరీ) క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 213 తగ్గి రూ. 28,918కి చేరింది. వెండి ధర కిలోకు రూ. 335 తగ్గి రూ. 40,405 వద్ద కొనసాగుతోంది. ఇక డాలర్ తో రూపాయి మారకపు విలువ ఇటీవలి కాలంలో తొలిసారి రూ. 68ని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 0.36 శాతం దిగజారి రూ. 68.06 వద్ద నడుస్తోంది. ఇదే సమయంలో క్రూడాయిల్ విలువ కూడా పతనమైంది. బ్యారల్ క్రూడాయిల్ భారత బాస్కెట్ రూ. 44 పడిపోయి రూ. 3,122కు చేరింది.