: లోక్ సభ సోమవారానికి వాయిదా.. రాజ్యసభ మధ్యాహ్నం 2.30 వరకు వాయిదా
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూడో రోజు వాయిదాల పర్వం కొనసాగింది. వాయిదా తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో ప్రతిపక్ష నేతల ఆందోళన మధ్యే ప్రశ్నోత్తరాలు ముగిశాయి. అనంతరం కూడా పెద్దనోట్ల రద్దుపై చర్చ చేపట్టాల్సిందేనని విపక్ష నేతలు పట్టుబడుతూ గందరగోళం సృష్టించారు. దీంతో లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళం నెలకొంది. ఛైర్మన్ పోడియాన్ని విపక్షనేతలు మరోసారి చుట్టుముట్టడంతో సభను ఈ రోజు మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.