: అసలు నీళ్లల్లో ఎందుకు పెట్టాలి?: 2 వేల నోట్లను తడపడంపై సుప్రీంకోర్టు ఆసక్తికర ప్రశ్న
కొత్తగా ప్రభుత్వం జారీ చేసిన 2 వేల రూపాయల కరెన్సీ నీటిలో తడిపితే రంగును కోల్పోతున్నదని చెబుతూ, నాణ్యతా రహితంగా వీటిని తయారు చేశారని ఓ లాయర్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, పిటిషన్ వేసిన న్యాయవాది ఎంఎల్ శర్మను పలు ప్రశ్నలు అడిగారు. అసలు కరెన్సీ నోట్లను నీటిలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించిన ఆయన "నోట్లను నీళ్లల్లో పెట్టవద్దు" అని సలహా ఇచ్చారు. ఈ నోట్లను రద్దు చేయాలన్న పిటిషనర్ కోరికను మన్నించేందుకు నిరాకరిస్తూ, బ్యాంకుల ముందు ప్రజల అవస్థలు తీరిస్తే సరిపోతుందని పేర్కొంది. కేవలం వీడియోలకు క్లిక్స్ కోసమే నీటిలో తడపడం వంటి పనులు చేస్తుంటారని అభిప్రాయపడుతూ, పిటిషన్ ను తోసిపుచ్చింది.