: టీడీపీ ఎమ్మెల్యే కారు నుంచి ఊడిపోయిన టైర్... తప్పిన పెను ప్రమాదం
పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్ ఊడిపోవడంతో, దాదాపు 60 గజాల దూరం కారు రోడ్డుపై గీసుకుంటూ వెళ్లి ఆగింది. బొర్రంపాలెం గ్రామంలో జన చైతన్య యాత్రలో పాల్గొని తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. యాత్ర తరువాత ఎర్రకాల్వ రిజర్వాయర్ లో మత్స్యశాఖ అందించిన చేప పిల్లలను వదిలిన ఆయన, తన అనుచరులతో కలసి పోలవరం వెళుతున్నప్పుడు, కారుకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది.