: ‘బిక్ష‌గాళ్లలా మార్చారు’.. చేతిలో ప్లేట్లు ప‌ట్టుకొని పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో విప‌క్షాల‌ ఆందోళ‌న


భారతదేశాన్ని మొత్తం క్యూలో నిలబెట్టారని, ప్ర‌తి ఒక్క‌రినీ బిక్ష‌గాళ్లలా మార్చారంటూ పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద చేతిలో ప్లేట్లు ప‌ట్టుకొని విప‌క్షాలు ఈ రోజు నిర‌స‌న తెలుపుతున్నాయి. ప్రజలు ఇప్పుడు ఏం తినాలి.. ఏటీఎం కార్డుల‌ను తింటారా? అంటూ ముఖ్యంగా తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌లు చేతిలో ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుతో మొత్తం క‌ష్టాలేన‌ని, వ‌చ్చేదేమీలేద‌ని నినాదాలు చేస్తున్నారు. మూడు రోజుల్లో పెద్ద‌నోట్ల ర‌ద్దు ఉప‌సంహ‌ర‌ణ చేస్తూ ప్ర‌క‌ట‌న చేయాల‌ని నిన్న తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్ర ప్ర‌భుత్వం ముందు డెడ్‌లైన్ విధించిన సంగ‌తి తెలిసిందే. లేదంటే ఆందోళ‌న‌ను ఉద్ధృతం చేస్తామ‌ని వారు హెచ్చ‌రించారు. మరోవైపు వాయిదా తరువాత 11.30కి ప్రారంభమైన రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. ఉభయసభలు మళ్లీ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News