: కుప్పకూలిన భారత మిడిలార్డర్, 12 పరుగుల వ్యవధిలో కోహ్లీ, సాహా, జడేజా అవుట్


విశాఖపట్నంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత జట్టు మిడిలార్డర్ ఘోరంగా విఫలమైంది. భారీ స్కోరు చేసిన కోహ్లీ నిష్క్రమణ తరువాత, ఎవరూ నిలదొక్కుకోలేదు. రెండో రోజు తొలి సెషన్ ఆదిలోనే తడబడిన భారత జట్టు, వరుసగా విరాట్ కోహ్లి (167), వృద్థిమాన్ సాహా (3), రవీంద్ర జడేజా (0) వికెట్లను నష్టపోయింది. వీరు ముగ్గురి వికెట్లూ అలీ ఖాతాలో చేరాయి. 101 ఓవర్ మూడో బంతికి కోహ్లీని అవుట్ చేసిన అలీ, ఆపై 105 ఓవర్ రెండు, నాలుగు బంతుల్లో సాహా, జడేజాలను పెవీలియన్ కు పంపాడు. ఈ మూడు వికెట్లూ 12 పరుగుల తేడాలో కోల్పోయిన ఇండియాను అశ్విన్ కాస్తంత ఆదుకున్నాడు. ప్రస్తుతం అశ్విన్ 38 పరుగులతో క్రీజులో ఉండగా, జయంత్ యాదవ్ 19 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత స్కోరు 116 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 401 పరుగులు.

  • Loading...

More Telugu News