: ‘గులాం నబీ ఆజాద్ క్షమాపణ చెప్పవలసిందే’.. ప్రారంభమైన 13 నిమిషాలకే ఉభయసభలు వాయిదా
పార్లమెంటు శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయిన మూడు నిమిషాలకే వాయిదా పడ్డాయి. పెద్దనోట్ల రద్దు అంశంపై గందరగోళం నెలకొనడంతో లోక్‌సభ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. మరోవైపు రాజ్యసభలో పెద్దనోట్ల రద్దుపై మోదీ సమాధానం చెప్పవలసిందేనని విపక్షనేతలు గందరగోళం సృష్టిస్తే, గులాం నబీ ఆజాద్ నిన్న చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పవలసిందేనని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభను 11.30 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటి ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.