: ర్యాగింగ్ వేధింపులు తాళలేక హాస్టల్ లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య
కర్నూలు జిల్లా నంద్యాల ఆర్‌జీఎం కాలేజీలో ర్యాగింగ్ వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆ కాలేజీలో ఐటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉషారాణి హాస్టల్ గదిలోనే ఉరివేసుకొని ఈ ఘటనకు పాల్పడింది. ఉషారాణి కడప జిల్లా బద్వేల్ కు చెందిన అమ్మాయి. కాలేజీలో సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయని అనేక సార్లు జూనియర్లు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో తీవ్ర వేదనకు గురైన ఉషారాణి ఆత్మహత్య చేసుకుందని జూనియర్లు ఆరోపిస్తున్నారు. మరోవైపు, ఉషారాణి ఆత్మహత్య విషయాన్ని బయటకు చెబితే చర్యలు తీసుకుంటామని విద్యార్థినులను యాజమాన్యం బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె మృతికి యాజమాన్యమే కారణమని జూనియర్లు ఆరోపిస్తున్నారు.