: వేలిపై ఇంక్ పెట్టొద్దు: జైట్లీకి ఎన్నికల సంఘం లేఖ


బ్యాంకుల్లో పాత కరెన్సీ నోట్లను మార్చుకునేందుకు వస్తున్న వారి వేలిపై సిరా గుర్తును పెట్టాలని ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ ఆక్షేపించింది. వచ్చే ఆరేడు నెలల్లో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటం, ఎన్నో రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు ఉండటంతో, వేలిపై పెట్టే సిరా గుర్తుతో సమస్యలు రావచ్చని చెబుతూ, ఈ నిర్ణయం తగదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ, కార్యదర్శి శశికాంత్ లకు ఓ లేఖను రాసింది. పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఉన్నందున సిరా గుర్తు వాడవద్దని తెలిపింది. ఈసీ లేఖపై ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం వెలువడాల్సివుంది.

  • Loading...

More Telugu News