: ఇంకా గృహ నిర్బంధంలోనే ముద్రగడ.. పోలీసుల బాడీ వార్న్ కెమెరాలతో చిత్రీకరణ
కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం గృహ నిర్బంధం వరుసగా నాలుగో రోజూ కొనసాగుతోంది. పద్మనాభం ఇంట్లోనే ఉండగా, ఆయన, ఏ క్షణమైనా తప్పించుకుని బయటకు వెళ్లిపోగలడని భావిస్తున్న పోలీసులు ఆయన కదలికలను బాడీ వార్న్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఆయన ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కాగా, ముద్రగడ మాట్లాడుతూ, పోలీసులు ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండమంటే అన్ని రోజులు ఉంటానని, వారు వెళ్లిపోయిన తరువాతే పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు. పోలీసుల నుంచి స్వేచ్ఛ లభించిన తరువాత జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చిస్తానని స్పష్టం చేశారు.