: సెలబ్రిటీ స్టార్ లిసా లిస్ ఆత్మహత్య!
ఓ మోడలింగ్ ట్రిప్ కోసం పెరూకు వచ్చిన ప్రముఖ సెలబ్రిటీ టీవీ స్టార్ లిసా లిన్ మాస్టర్స్ తన స్కర్ట్ తో ఉరివేసుకుని మరణించింది. ఆమె బస చేసిన హోటల్ సిబ్బంది లిసా ఆత్మహత్యను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెరూ రాజధాని నగరం లిమాలోని న్యూవో ముండా హోటల్ లో ఈ ఘటన జరిగింది. ఆమెను కొంతకాలంగా మానసిక సమస్యలు చుట్టుముట్టాయని, వీటి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్ బ్రేకబుల్ కిమ్మీ షుమిడ్ట్, లా అండ్ ఆర్డర్: స్పెషల్ విక్టిమ్స్ యూనిట్, అగ్లీ బెట్టీ, గాసిప్ గర్ల్ తదితర ఎన్నో టీవీ షోల్లో నటించి అభిమానులకు దగ్గరైన ఆమె మృతిపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.