: ప్రజలకు కేంద్రం మరో షాక్.. వంద నోట్ల ముద్రణను నిలిపివేసిన సర్కారు!
పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం మరో షాకిచ్చింది. రద్దయిన పాతనోట్ల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టే విషయంలో బిజీగా ఉన్న కేంద్రం వంద నోట్ల రూపాయల ప్రింటింగ్‌ను నిలిపివేసింది. ఈమేరకు ఆర్బీఐని ఉటంకిస్తూ 'బ్లూంబర్గ్' పేర్కొంది. అయితే నోట్ల రద్దుపై వస్తున్న వార్తలు, అభిప్రాయాలు, అంచనాలను ఆర్థికశాఖ అధికార ప్రతినిధి డీఎస్ మాలిక్ ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, త్వరలోనే పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. రూ.1000, రూ.500 నోట్లు పూర్తిగా చలామణిలోకి వచ్చి, ఏటీఎంల రీక్యాలిబరేషన్ పూర్తయితే ప్రస్తుత ఇబ్బందులకు పుల్‌స్టాప్ పడుతుందని ఆయన వివరించారు. అయితే ప్రస్తుతం మాత్రం అవసరానికి సరిపడా వందనోట్ల సరఫరా లేదని, కొరత ఉన్నమాట వాస్తవమేనని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా నోట్ల ప్రింటింగ్ రెండు నెలల క్రితమే మొదలైందని, నోట్ల సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేదని గురువారం ఆర్బీఐ పేర్కొంది.